రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో టీడీపీ ఎంపీలు భేటీ!

వాస్తవం ప్రతినిధి: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రతినిధి బృందం కలవనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలపై విన్నవించేందుకు నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ ను కలవనున్నారు టీడీపీ ఎంపీలు. గత 13నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు ఏమీ బాగా లేవని, ప్రాథమిక హక్కులు కాలరాయడం.. రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం.. రాజ్యాంగ ఉల్లంఘనలు మొదలైన అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు.

రాష్ట్రంలో వైసీపీ నాయకులు హింసా విధ్వంసాలు, ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, బోర్ వెల్స్ ధ్వంసం, తోటల నరికివేత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాలు చేస్తున్నారంటూ మొదలైన విషయాల గురించి రాష్ట్రపతికి వివరించనున్నారంట టీడీపీ ఎంపీలు. మరోవైపు వైసిపి సర్కార్ తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలన్నింటి గురించి సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.