కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పై అభినందనలు..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో వైరస్ బాధితులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనబడటం లేదు. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వైరస్ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా హాస్పిటల్స్ లో కనీస సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం లేదని చాలామంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ బాధలు చెప్పుకున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో కరోనా బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది నెటిజన్లు అధికార పార్టీ నేతలకు కరోనా వైరస్ వస్తే వెంటనే గాంధీ హాస్పిటల్ లో జాయిన్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అసలు గాంధీ హాస్పిటల్ లో అడుగు పెట్టడానికి ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోని తరుణంలో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోటానికి స్వయంగా గాంధీ హాస్పిటల్ లో అడుగుపెట్టారు. మొత్తం పరిశీలించి గాంధీ హాస్పిటల్ వెళ్ళటానికి ఎవరు భయపడనవసరం లేదు అని ప్రజలకు ధైర్యం చెప్పారు. అలాగే కరోనా రోగులలో కూడా ధైర్యం కలిగించడానికి తాను ఆసుపత్రి మొత్తం సందర్శించినట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. హాస్పిటల్ మొత్తం పరామర్శించి అందులోనూ ఐసీయూలో ఉన్న వారిని సైతం కిషన్ రెడ్డి పరామర్శించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యులకు మరియు అధికారులకు సరైన వైద్య సదుపాయాలు రోగులకు అందించాలని మంత్రి కోరారు. స్వయంగా కిషన్ రెడ్డి… కేసీఆర్ పట్టించుకొని కరోనా గాంధీ హాస్పిటల్ లోకి వెళ్లడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.