డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మద్దతు ఇస్తారని గ్యారంటీ లేదు: జాన్ బోల్టన్

వాస్తవం ప్రతినిధి: భారత్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా-ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మద్దతు ఇస్తారనే గ్యారెంటీ లేదని అన్నారు. చైనా తన అన్ని సరిహద్దుల్లో దూకుడుగా ప్రవర్తిస్తున్నదని, ఈ కారణంగా, జపాన్, ఇండియా, ఇతర దేశాలతో దాని సంబంధాలు క్షీణించాయని చెప్పారు. చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన పక్షంలో భారత్ వైపు ట్రంప్ నిలుస్తాడనేది అనుమానమే అని తెలిపారు. నవంబర్ ఎన్నికల తరువాత ట్రంప్ ఇంకా ఏం చేస్తారో చెప్పలేమన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి కొనసాగించినా ఆశ్చర్యపోవద్దని సూచించారు.