కరోనా వైరస్ తో మహిళలకే ఎక్కువ సమస్యలు: ఐక్యరాజ్యసమితి

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల మహిళలే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారని చెప్పింది. కరోనా విస్తృతి నేపథ్యంలో మహిళలు, బాలికల అవసరాలపై దృష్టి పెట్టాలని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి పిలుపునిచ్చింది. ‘ఈ పని ఏ ఒక్క సంస్థో, దేశమో తలుచుకుంటే జరిగేది కాదని..ప్రపంచం మొత్తం ఏకమైతేనే ఇది సాధ్యం’ అని యూఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది. కోవిడ్‌-19 మహమ్మారి ప్రతి ఒక్కరినీ, ప్రతిచోటా ప్రభావితం చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రభావితం చేయదని గుర్తించాలని యూఎన్‌ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు.