ఆ కొత్త వైరస్‌ కూడా కరోనానే కావొచ్చు: WHO

వాస్తవం ప్రతినిధి: కజకిస్థాన్ లో కరోనా కంటే భయంకరమైన మరో వైరస్ విజృంభిస్తోందని, వెయ్యి మందికి పైగా ఈ గుర్తు తెలియని వైరస్ తో మరణించారని చైనా పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కజకిస్థాన్ ఆ వార్తలు అవాస్తవమని వెల్లడించింది. కొత్త వ్యాధికి బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ న్యూమోనియా లక్షణాలు ఉన్నాయని.. ఇది ఎలా వచ్చిందో స్పష్టమైన కారణాలు తెలీడం లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. తాజాగా ఈ వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కజకిస్థాన్ లో న్యూమోనియా కలిగిస్తున్న ఆ వైరస్ బహుశా కరోనాయే అయ్యుంటుందని తెలిపింది. చాలా న్యూమోనియా కేసులకు కరోనాయే కారణమని తాము భావిస్తున్నామని, స్థానిక అధికారులతో ఎక్స్‌రేలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.