కజకిస్థాన్‌లో చిక్కుకున్న 230 మంది తెలుగు విద్యార్థులు

వాస్తవం ప్రతినిధి: కజకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 230 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. తమ స్వస్థలాలకు వచ్చేందుకు బుక్‌ చేసుకున్న విమానం రాకపోవడంతో వీరంతా రెండు రోజులుగా ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా యూనివర్సిటీలు తాత్కాలికంగా యూసివేయడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే తెలుగు విద్యార్థులకు రవాణా సదుపాయాలు లేకపోడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కజకిస్తాన్ లోని ఓ ట్రావెల్ ఏజెన్సీ రవాణా సదుపాయం కల్పిస్తానమని చెప్పి.. 45 వేలు కట్టించుకొని.. తరువాత తమను మోసం చేశారని.. మెడికల్ విద్యార్థులు వాపోతున్నారు. తమను సొంత రాష్ట్రానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి జైశంకర్‌కు నామ నాగేశ్వరరావు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు.