భార‌త్‌ నుంచి అబుధాబికి ప్ర‌త్యేక‌ విమాన స‌ర్వీసులు: ఎతిహాద్

వాస్తవం ప్రతినిధి: గ‌ల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ ఎతిహాద్ ఈ నెల 12 నుంచి 26 వ‌ర‌కు భార‌త్‌లోని ఆరు న‌గ‌రాల నుంచి అబుధాబికి ప్ర‌త్యేక‌ విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇండియాలోని బెంగళూరు, చెన్నై, కొచ్చి, న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై న‌గ‌రాల నుంచి అబుధాబికి విమానాలు న‌డ‌ప‌నున్న‌ట్లు ఎతిహాద్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. “ప్రయాణీకులందరూ అబుధాబి ప్రభుత్వం నుంచి ఐసీఏ అనుమతి కలిగి ఉండాలి. అలాగే అవసరమైన అనుమతులు లేకుండా చెక్-ఇన్ చేయడానికి అనుమతించబడదు.” అని ఎయిర్‌లైన్స్ యాజ‌మాన్యం పేర్కొంది. కాగా ‘వందే భారత్ మిష‌న్’‌లో భాగంగా 15 రోజుల పాటు ఇండియా నుంచి యూఏఈకి ప్ర‌త్యేక విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు భారత ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.