ప్రముఖ ఎన్నారై శాస్త్రవేత్తకు అరుదైన గౌర‌వం!

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ పరాగ్ చిట్నిస్ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ తాత్కాలిక‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో చిట్నిస్‌ను ఎన్ఐఎఫ్ఏ ప్రోగ్రామ్స్‌కు అసోసియేట్ డైరెక్టర్‌గా నియమించారు. దీంతో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో సుమారు 1.7 బిలియన్ డాలర్ల పరిశోధన ప్రాజెక్టుల అమలు జ‌రిగింది. “డాక్టర్ చిట్నిస్‌కు డైరెక్టర్ కార్యాలయంలో 31 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన, అనుభవాన్ని క‌లిగి ఉన్నారు. అందుకే ఆయ‌న‌ను ఎన్ఐఎఫ్ఏ తాత్కాలిక‌ డైరెక్టర్‌గా నియమించ‌డం జ‌రిగింద‌ని సంస్ధ తెలిపింది. ఇంత‌కుముందు ఈ ప‌ద‌విలో ఉన్న డాక్టర్ స్కాట్ యాంగిల్ స్థానంలో చిట్నిస్ నియ‌మితుల‌య్యారు.