భారత మాజీ క్రికెటర్ కు కరోనా పాజిటివ్!

వాస్తవం ప్రతినిధి: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి గత కొన్నివారాలుగా ఉద్ధృతంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో, అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. తాజాగా యూపీ మంత్రి, భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. చేతన్ చౌహాన్ శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా, టెస్టు రిపోర్టు నిన్న వచ్చింది. ఈ నేపథ్యంలో, లక్నోలోని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. చేతన్ చౌహాన్ కు లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ విధించారు.