ధోనీ నిర్ణయానికి నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను: బీసీసీఐ అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ చేసిన ఓ పని తనను ఆశ్చర్యపరిచిందని టీమిండియా మాజీ సారధి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. తన చివరి టెస్టు మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్ల ఆటలో గంగూలీకి జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించాడు ధోనీ. ఆ నాటి అనుభవాన్ని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ‘ధోనీ అలా చేస్తాడని అసలు ఊహించలేదు. కానీ ఆ సమయంలో తన మనసంతా రిటైర్‌మెంట్‌పైనే ఉందని, ఆ చివరి మూడు నాలుగు ఓవర్లలో ఏం చేశానో కూడా సరిగా గుర్తులేదని దాదా తెలిపాడు. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడంలో ధోని గొప్పవాడు అని అన్నాడు.