‘అంజలి’ సినిమా విడుదలై నేటికి 30 ఏండ్లు

వాస్తవం ప్రతినిధి: మణిరత్నం హృదయంలో నుంచి జాలువారిన ఓ గొప్ప చిత్రం ‘అంజలి’. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏండ్లు పూర్తయ్యాయి. 1990 లో విడుదలైన ‘అంజలి’ సినిమాలో చాలా సున్నితమైన విషయాన్ని తీసుకుని మణిరత్నం ఒక అద్భుత సెల్యులాయిడ్ ను తీర్చిదిద్దారు. అప్పటి వరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. మేధో వైకల్యం ఉన్న ఒక చిన్న అమ్మాయి కథను, ఆమె చుట్టూ అల్లుకున్న కుటుంబం, సమాజం దృక్పథం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పగలిగారు. ఈ చిత్ర కథకు ఈనాటికీ భారీ సామాజిక ప్రాముఖ్యత ఉంది. మేధో వైకల్యం ఉన్న పిల్లవాడిని పెంచడంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లను, అలాంటి పిల్లలతో వ్యవహరించడంలో పరిపక్వత, సున్నితత్వం .. ఇలా ఎన్నో విషయాలను అందంగా మనుసులకు హత్తుకునేలా చూపించారు మణిరత్నం.