రైతుగా మారిన బాలీవుడ్ కండలవీరుడు

వాస్తవం ప్రతినిధి: క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుండి స‌ల్మాన్ ముంబై శివార్ల‌లో ఉన్న ప‌న్వెల్ ఫాం హౌజ్‌లోనే ఉంటున్నారు. అయితే క‌రోనా స‌మ‌యంలో ప్ర‌కృతి మ‌ధ్య ఎక్కువ‌గా సెద తీరుతున్న స‌ల్మాన్ ఖాన్ తాజాగా రైతుగా మారాడు. త‌న ఫాం హౌజ్‌లో నాట్లు నాటుతున్న‌ట్టు ఫోటోకి ఫోజివ్వగా దానిని త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌కి తినేవాడి పేరు ధాన్యం మీద రాసి ఉంటుంది. జై జ‌వాన్ జై కిసాన్ అంటూ కామెంట్‌గా రాసాడు. కాగా తాజాగా స‌ల్మాన్ న‌టిస్తున్న రాధే సినిమా త్వ‌ర‌లో షూటింగ్ జ‌రుపుకోనుండ‌గా, స్డూడియోలో వేసిన సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నారు. ప్రభుదేవా-సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం రాధే.