బాలీవుడ్‌లో మరో తార నింగికేగింది!

వాస్తవం ప్రతినిధి: బాలీవుడ్‌లో మరో తార నింగికేగింది. ప్రముఖ నటుడు రంజన్‌ సెహగల్‌(36) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఛండీగడ్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. కాగా రణ్‌దీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌లు ప్రధాన పాత్రలో నటించిన సరబ్‌జిత్‌ మూవీతో పాటు ఫోర్స్‌, కర్మ, మహి ఎన్‌ఆర్‌ఐ వంటి పలు చిత్రాల్లో రంజన్ నటించారు. ఆయన మరణంపై స్పందిస్తున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ ప్రముఖులైన ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్‌ మరణించిన సంగతి తెలిసిందే.