యూపీలో చిచ్చురేపుతున్న వికాస్ దుబే ఎన్కౌంటర్!

వాస్తవం ప్రతినిధి: మరోసారి యూపీలో కుల రాజకీయాలు తెరపైకి వచ్చాయి. యోగీ ప్రభుత్వంపై ఠాకూర్లను విమర్శిస్తూ బ్రహ్మణ వర్గానికి చెందిన నేతలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది వికాస్ దూబే అనే గాంగ్ స్టర్ ను కాదని.. బ్రాహ్మణ గౌరవ ప్రతిష్టలను అంటూ సోషల్ మీడియాలో యూపీ బ్రాహ్మణులు పోస్టులు పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. వికాస్ దూబే బ్రాహ్మణ సామాజికవర్గానికి అమితంగా ప్రేమించే గౌరవించే పులిలాంటి వ్యక్తి అని.. పరుశురాముడి ప్రతినిధి వికాస్ దూబే అంటూ కీర్తిస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్ తో బ్రాహ్మణులపై తమకున్న కోపాన్ని ఠాకూర్లు మరోసారి ప్రదర్శించారని ఆరోపిస్తున్నారు.
వికాస్దూబే ఎన్కౌంటర్ కేవలం కక్ష సాధింపుగానే యూపీ బ్రహ్మణులు చూస్తున్నారు. దీంతో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తుండటంతో యోగీ సర్కార్ ఈవిషయంలో ఎలా ముందుకెళుతుందోననే ఆసక్తి నెలకొంది.