కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. 26 ఏళ్ల యువకుడికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు!

వాస్తవం ప్రతినిధి: ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే తొలిసారి. కేవలం 26 ఏళ్ల వయసున్న ఓ యువకుడికి ఏకంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. ఎక్కడ? ఏ రాష్ట్రం..? ఎవరా యువకుడు..? అనే వివరాల్లోకేళితే..

గుజరాత్ రాష్ట్రంలో త్వరలో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ క్రమంలో ఎన్నికల్లో తన సత్తా చాటాలని చూస్తున్న కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా కీలక నిర్ణయం తీసుకొంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తోంది.  పార్టీలో అంకిత భావంతో పని చేసే వారికి.. యువరక్తానికి బాధ్యతలు ఇచ్చింది. ఆ క్రమంలోనే పటేల్ ఉద్యమ నాయకుడు.. యువకుడు హార్దిక్ పటేల్ కు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది.

2019 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ చేరాడు. చేరి ఏడాది కూడా ముగియకముందే ఏకంగా పార్టీ బాధ్యతలు ఇవ్వడం పార్టీలోనూ.. గుజరాత్లోనూ హాట్ టాపిక్గా మారింది. అయితే హార్దిక్ నియామకం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహం వేరుగా ఉంది.