కరోనా ఎఫక్ట్: 8,000 మంది ఖైదీలను విడుదల చేస్తున్న కాలిఫోర్నియా

వాస్తవం ప్రతినిధి: కాలిఫోర్నియా జైలులో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 8,000 మంది ఖైదీలను ఆగస్టు చివరి నాటికి విడుదల చేస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ పని చేయనున్నట్లు అక్కడి జైల్‌ అధికారులు తెలియజేశారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ ప్రకారం రాష్ట్ర జైళ్లలో అదుపులో ఉన్న 2,286 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయని, శుక్రవారం ఉదయం 31 మంది మరణించినట్లు తెలిపారు. మొదటి విడుతలో 180రోజులు, అంతకన్నా తక్కువ శిక్ష అనుభవిస్తున్న వారిని విడిపించనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా 4,800 మంది ఖైదీలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య నిపుణులు, ఖైదీల తరపు లాయర్లు ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.