కరోనా వ్యాక్సిన్‌ ప్రస్తుతం చాలా అవసరం: బిల్‌గేట్స్‌

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం కరోనావైరస్ వ్యాక్సిన్‌ ప్రజలకు చాలా అవసరమని, దాన్ని అత్యవసరంగా అందుబాటులో ఉంచాలని బిల్‌గేట్స్‌ అన్నారు. టీకాల తయారీని వేగవంతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇది ఘోరమైన మహమ్మారి అని దీన్నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సిన్ కోసం అన్వేషణ, ట్రయల్స్ నడుస్తోంది. వాషింగ్టన్‌లో కొంతమంది అధికారులతో టీకాను కనిపెట్టడానికి యూఎస్‌ బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది, యూఎస్‌ నివాసితులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.