ప్ర‌వాసులు, పౌరుల‌కు కీల‌క సూచ‌నలు చేసిన కువైట్

వాస్తవం ప్రతినిధి: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో కువైట్ త‌మ దేశ పౌరులు, ప్రవాసుల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విదేశీ ప్ర‌యాణాలు మానుకోవ‌డ‌మే మేలు అని కోరింది. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో త‌ప్పిస్తే అన‌వ‌స‌ర ప్ర‌యాణాలను వాయిదా వేసుకోవాల‌ని తెలిపింది. ఎందుకంటే ప్ర‌యాణ స‌మ‌యంలో సులువుగా ఈ వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశం ఉండ‌డంతో కువైట్ ఈ సూచ‌న‌లు చేసింది. కాగా కువైట్‌లో శుక్ర‌వారం 740 కొత్త కేసులు న‌మోదైతే… 528 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 53,580 మంది కోవిడ్ బారినపడ్డారు. ‌