ఇండియన్ డాక్టర్లను ప్రశంసించిన బ్రిటన్ ప్రభుత్వం

వాస్తవం ప్రతినిధి: కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఇండియన్ డాక్టర్లను బ్రిటన్ ప్రశంసించింది. ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ వర్చువల్‌‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎస్‌లో భారతీయుల సేవలను కొనియాడారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో భారత్‌తో కలిసి మహమ్మారిపై పోరాడుతున్నందుకు గర్వపడుతున్నాం’అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘దాదాపు 25వేల మంది నిపుణులైన ఇండియన్ డాక్టర్లు విపత్కర పరిస్థితుల్లో బ్రిటన్‌లో సేవలందిస్తున్నారు. వారి సహకారాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నాం’అని తెలిపారు.