ఇండియా-ఇంగ్లండ్‌ సిరీస్ వాయిదా!

వాస్తవం ప్రతినిధి: ఎప్పుడెప్పుడు క్రికెట్ మొదలు పెడదామా అని వెయిట్ చేస్తున్న టీమిండియాకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. సెప్టెంబర్–అక్టో బర్‌లో ఇండియాలో జరగాల్సిన ఇంగ్లండ్‌ టూర్‌ పోస్ట్‌పోన్‌ కావడం దాదాపుగా ఖాయమైంది. ఇందులో భాగంగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉండడంతో ఈ టూర్ వాయిదా వేయడం తప్ప మరోదారి కనిపించడం లేదు. ఈ నెల 17న జరిగే బోర్డు మీటింగ్ తర్వాత ఈ సిరీస్‌‌పై అధికారిక ప్రకటన వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇదే జరిగితే స్వదేశంలో ఓ సిరీస్ ఆడేందుకు టీమిండియా 2021 దాకా ఆగాల్సిందే.