అండర్సన్ తన‌ బౌలింగ్‌తో తీకమక పెడతాడు: సచిన్‌

వాస్తవం ప్రతినిధి: రివర్స్‌ స్వింగ్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడు జేమ్స్‌ అండర్సన్‌ అద్భుతమైన బౌలర్‌ అని స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ టెండుల్కర్‌ అన్నాడు. తాజాగా విండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియన్‌ లారాతో 100 ఎంబీ మొబైల్‌ యాప్‌లో సచిన్‌ మాట్లాడుతూ బౌలింగ్‌ గురించి పలు విషయాలను చెప్పాడు. ‘అండర్సన్‌ బౌలింగ్‌ చేసే సమయంలో బ్యాట్స్‌మెన్‌ను తికమక పెడతాడు. బంతి ఔట్‌స్వింగ్‌ వేస్తున్నట్టు వేసి దాని దిశను మారుస్తాడు. దాంతో చాలా మంది బ్యాట్స్‌మెన్స్‌ అతని బౌలింగ్‌లో ఆడేందుకు తీకమక పడతారు. అండర్సన్‌ వేసిన బంతి బ్యాట్స్‌మెన్‌కు దూరంగా వెళ్లి వికెట్లకు తాకుతుంది. ప్రస్తుతం స్టువర్ట్‌ బ్రాడ్‌ కూడా అలానే వేస్తున్నాడు. అండర్సన్‌ను నేను అద్భుతమైన బౌలర్‌గా పరిగణిస్తా’ అని సచిన్‌ వెల్లడించాడు.