ప్రభాస్ కి సూచనలు ఇస్తున్న అస్సాం పోలీసులు..!!

వాస్తవం సినిమా: ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సినిమా రికార్డులను పగలగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడంతో ప్రభాస్ విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయింది. దీనికి టైటిల్ ‘రాధే శ్యామ్’ అని ప్రకటించారు నిర్మాతలు. అలాగే ప్రభాస్, పూజ హెగ్డే దగ్గరగా ఉన్న పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా వదిలారు. దీనిపై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే అస్సాం పోలీస్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. “మీకు కావాల్సిన వారు బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోమని చెప్పండి. మేము ప్రభాస్ కు కాల్ చేసి చెప్దామని ప్రయత్నించాం కానీ కుదర్లేదు. సో ఇలా ఫోటోషాప్ ద్వారా మెసేజ్ పంపుతున్నాము” అని ఫన్నీ ట్వీట్ చేసారు.