పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు సరికొత్త ప్లాన్ వేసిన ప్రియాంక గాంధీ..??

వాస్తవం ప్రతినిధి: ప్రియాంక గాంధీ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముద్దుల కుమార్తె . సోనియా గాంధీ , రాజీవ్ గాంధీ జంటకు ఇద్దరు సంతానం . ఒకరు రాహుల్ గాంధీ, ఇంకొకరు ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటోంది.

ప్రియాంక గాంధీ ఇక పూర్తి స్థాయిలో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. అందుకే, త్వరలోనే ప్రియాంక గాంధీ తన నివాసాన్ని లక్నోకు మార్చనున్నారు. ఇదిచాలా కాలం నుంచి అనుకున్న విషయమే అయినప్పటికీ, ఉత్తర్ ప్రదేశ్ ను సోంతం చేసుకునే దిశగా ప్రియాంక గాంధీ ప్రయత్నిస్తున్నారని పలువురు పార్టి నేతలు అంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగబోతున్నాయి. 2022 లో జరిగే ఈ ఎన్నికలకు ప్రియాంక గాంధీ ఇప్పటి నుంచే సమాయత్త మవుతున్నట్లు తెలుస్తుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రియాంక గాంధీతో పాటు పార్టీని కూడా నైరాశ్యంలో ముంచాయి. అమేధీలో రాహుల్ ఓటమిని ప్రియాంక గాంధీ జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీని గాడిన పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఆమె ఉత్తర్ ప్రదేశ్ కు షిఫ్ట్ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్దమయింది. మొత్తానికి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.