ఇది జస్ట్ ట్రైలర్ అంటున్న విజయసాయిరెడ్డి..!!

వాస్తవం ప్రతినిధి: వైయస్ జగన్ ఏడాది పరిపాలనపై ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల రాజకీయ నేతలు మరియు కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించటం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా బెస్ట్ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్ నాలుగో స్థానం సంపాదించడం జరిగింది. జాతీయ మీడియా సైతం జగన్ కరోనా వైరస్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను మరియు ఏపీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి అభినందిస్తూ కథనాలు ప్రసారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ ఏడాది పరిపాలనపై విజయసాయి రెడ్డి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో అసలు ఏమన్నారంటే… జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే అని ఆయన అన్నారు. మొత్తం మీద రాబోయే నాలుగు సంవత్సరాలలో చంద్రబాబుకి అసలు సినిమా జగన్ రెడీ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి మాటలు చూస్తే అర్థమవుతుంది.