జమ్ము-కాశ్మీర్‌లోఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం

వాస్తవం ప్రతినిధి: నియంత్రణ రేఖ వద్ద నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. జమ్ము-కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు కేవలం 100మీ దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఎల్‌ఓసీకి దగ్గరగా కదలికలు కనిపించడంతో సైన్యం అప్రమత్తమయింది. వెంటనే వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా అటు నుంచి కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం కూడా ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు ఓ సైనికాధికారి ప్రవటించారు. మరణించిన ఇద్దరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారి వద్దనుంచి ఏకే-47 రైఫిళ్ళు, వందల సంఖ్యలో బులెట్లు స్వాధీనం చేసుకున్నారు.