బీసీసీఐ సీఈవో పదవికి రాహుల్‌ జోహ్రీ రాజీనామా!

వాస్తవం ప్రతినిధి: బీసీసీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) రాహుల్‌ జోహ్రీ తన పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బోర్డు తెలిపింది. గతేడాది డిసెంబరులో రాహుల్‌ రాజీనామా చేశారు. చాలాకాలం పెండింగ్‌లో ఉన్న అతడి రాజీనామాను బీసీసీఐ ఆమోదించిందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

జోహ్రీ పదవీకాలం 2021 వరకు ఉంది. 2016లో బీసీసీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా రాహుల్‌ బాధ్యతలు చేపట్టారు. సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలోని బృందం బోర్డు అధికారాలు చేపట్టడంతో జోహ్రీ రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది.