ఏ అవకాశం దొరికినా ఐపీఎల్ నిర్వహిస్తాం: గంగూలీ

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడు.. ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌ నిర్వహించడమే ఇప్పుడు తనకున్న మెుదటి కర్తవ్వమన్నారు సౌరభ్‌ గంగూలీ. ఐపీఎల్ లేకుండా ఈ ఏడాది ముగిసిపోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. ఐపీఎల్ నిర్వహించాలని గంగూలీ గట్టి పట్టుదలతో ఉండడంతో అభిమానులలో ఆశలు చిగురించాయి. ఐసీసీ టి20 వరల్డ్‌కప్‌ భవితవ్యాన్ని బట్టి ఐపీఎల్ తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాలను చూస్తే టీ20 వరల్డ్‌కప్‌ జరగడం కష్టమే అనిపిస్తోంది. కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గకపోవడంతో వరల్డ్‌కప్‌‌ను ఐసీసీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కవేళ భారత్‌లో పరిస్థితులు అనకూలించకపోతే లీగ్‌ను విదేశాల్లో నిర్వహించే ఆలోచనలో బోర్డు ఉంది.