ఇంగ్లాండ్‌ సిరీస్‌లో గూగ్లీయే నా ప్రధాన అస్త్రం: పాకిస్థాన్‌ స్పిన్నర్‌

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌తో ఆగస్టులో జరుగనున్న టెస్టు సిరీస్‌లో గూగ్లీయే తన ప్రధాన అస్త్రమని పాకిస్థాన్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లోని పొడి వికెట్‌ తన బౌలింగ్‌కు ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. గత రెండు రోజుల మ్యాచ్‌లో సందించిన గూగ్లీలు సరైన ప్రదేశంలో పడి మంచి స్పిన్‌ అయ్యాయి షా అన్నారు. కౌంటీల్లో ఆడేందుకు స్పిన్నర్లు సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఎందుకంటే ఈ మూడు నెలల్లో పొడి వికెట్‌ స్పిన్లర్ల ఎంతగానో సహకరిస్తుందని చెప్పారు. యాసిర్‌ బౌలింగ్‌ తో పాటు బ్యాట్‌తోనూ రాణించేందుకు నెట్స్‌లో ప్రాక్టిస్‌ చేస్తున్నట్లు తెలిపారు.