బ్లాక్‌మెయిల్ కేసులో ఎన్నారై అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: ఈజీ మ‌నీ కోసం యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉద్యోగి.. అమాయ‌కుల‌ను బ్లాక్‌మెయిల్ చేశాడు. వాంటెడ్ లిస్టులో పెడితే మీకు వీసా రాదు, అలాగే ప్ర‌యాణాల‌పై బ్యాన్ విధిస్తార‌ని బెదిరించి అందిన‌కాడికి అమాయ‌కుల నుంచి దండుకున్నాడు. దీనికోసం ఓ భార‌త వ్య‌క్తితో పాటు మ‌రో ఎమిరెటీని త‌న‌తో క‌లుపుకుని స‌ద‌రు ఉద్యోగి గ‌త‌కొంత‌కాలంగా అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నాడు. ఈ విష‌యం ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌డంతో ఆ ఉద్యోగిని మరియు అత‌నికి స‌హ‌క‌రించిన భార‌త వ్య‌క్తి, మ‌రో ఎమిరెటీ పౌరుడిని అరెస్ట్ చేశారు. ఈ విష‌యాన్ని ఆ దేశ ఉప ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించారు. ఆ ఉద్యోగి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఆయన ట్విట్టర్ లో తెలిపారు.