సీపీఎల్‌లో ప్రవీణ్‌ తాంబే రికార్డు

వాస్తవం ప్రతినిధి: కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా ప్రవీణ్‌ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. విండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ పోలార్డ్‌ సారథ్యంలో టిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. టీమిండియా సీనియర్‌ లెగ్‌స్పిన్నర్‌గా ప్రవీణ్‌ తాంబే 41ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం 48ఏళ్ల తాంబే కరేబీయర్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఎంపికై అందరిదృష్టిని ఆకట్టుకున్నాడు. తాంబే 2013-16 మధ్య 33ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఆడి 28వికెట్లు తీశాడు. 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి 15వికెట్లు తీశాడు. గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున కూడా తాంబే ఆడాడు. ఈ ఏడాది సీపీఎల్‌ ఆగస్టు 18నుంచి సెప్టెంబర్‌ 10 వరకు జరగనుంది.
మరోవైపు కేంద్రం ఈ నెలాఖరువరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుచేసింది. ఒకవేళ కేంద్రం ఈ గడువును పెంచితే తాంబే సీపీఎల్‌ ఆడటం అనుమానాస్పదమే.