మరో పదేళ్లు సీఎస్‌కే కు ధోని అధినేతగా ఎదుగుతాడు: విశ్వనాథన్‌

వాస్తవం ప్రతినిధి: చెనై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మరో పదేళ్లలో ఆ జట్టుకు అధినేతగా ఎదుగుతాడని సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్‌ అన్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌ నుంచి తప్పుకున్న ధోని ఆటకు దూరమైన విషయం తెలిసిందే. మార్చి 29నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సీజన్‌ కోసం ధోని చాలా కష్టపడ్డాడని విశ్వనాథన్‌ తెలిపాడు. చైన్నైలో నిర్వహించిన శిక్షణలో ధోని కఠిన సాధన చేశాడని తెలిపాడు. ‘ధోని మరో పదేళ్లలో సీఎస్‌కే అధినేతగా మారుతాడని, ఈ ఐపీల్‌ సీజన్‌లో చాలా బాగా ఆడాలని నిర్ణయించుకున్నాడని విశ్వనాథన్‌ వెల్లడించాడు.