మెల్‌బోర్న్‌లో మళ్లీ లాక్‌డౌన్‌..టీ20 వరల్డ్‌ కప్‌ రద్దు?

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో ఆరు వారాల పాటు మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ వీలైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఆసీస్‌తో పాటు భారత్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రపంచకప్‌ రద్దైతే అదే సమయంలో ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మూడు రోజుల్లో టీ20 వరల్డ్‌కప్‌పై తుది నిర్ణయం వస్తుందని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు.