పుట్టినరోజు నాడు ధోనీ కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: ధోనీ త‌న 39వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక‌పై యాడ్స్ చేయ‌బోన‌ని, అలాంటి వాటికి దూరంగా ఉంటాన‌ని వెల్ల‌డించాడు. ఇక నుంచి ఎలాంటి డీల్సూ కుదుర్చుకోన‌ని తెలిపాడు. అంతేకాకుండా మ‌రో స్ట‌న్నింగ్ డెసిష‌న్ తీసుకున్నాడు. సేంద్రీయ వ్యవసాయానికి మాత్రం బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారనున్నాడు. అంతేకాదు తన సొంత సేంద్రీయ ఎరువు బ్రాండ్‌ను ధోనీ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నాడు.

ఇక ధోనీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం క‌రోనా వైర‌స్సే. అదేంట‌ని అనుకుంటున్నారా? ఈ క‌రోనా పూర్తిగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా త‌న ఫామ్ హౌస్ కే ప‌రిమితం అయ్యాడు ధోనీ. ఈ క్ర‌మంలోనే త‌న‌కు వ్య‌వ‌సాయం చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చిందట‌‌. దీంతో వెంట‌నే ఓ ట్రాక్ట‌ర్ కొని, ఫార్మింగ్ మొద‌లు పెట్టాడు. అది కూడా సేంద్రీయ వ్య‌వ‌సాయం చేయాల‌నుకుంటున్నాడట‌‌.