ఊపిరిపీల్చుకున్న ప్రభాస్ అభిమానులు..!!

వాస్తవం సినిమా: ‘సాహో’ సినిమా ప్లాప్ అయిన తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ పెట్టాలని యూనిట్ పరిశీలిస్తుంది. ఇదిలా ఉండగా సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు టైటిల్ గాని ఎలాంటి న్యూస్ గాని సినిమా యూనిట్ బయటికి ప్రకటించలేదు. దీంతో ఎప్పటి నుండో సినిమా అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకి ఊపిరి పీల్చుకునే వార్త సినిమా యూనిట్ ప్రకటించింది.

అదేమిటంటే జులై 10 ఉదయం 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ను డార్లింగ్ ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.