భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం..గడిచిన 24 గంటల్లో..

వాస్తవం ప్రతినిధి: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,752 కేసులు నమోదు కాగా, 482 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో మొత్తం 7,42,417 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,64,944 ఉండగా, 4,56,830 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 20,642 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.