టీడీపీ కి ఇక అంతా శుభాలే.. ఎందుకంటే..??

వాస్తవం ప్రతినిధి : ప్రస్తుత్తం టీడీపీ పరిస్దితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్నట్లు తయారైంది పరిస్ధితి. ఓ పక్క జగన్ సర్కార్ దూకుడికి టీడీపీ నేతలు .. పోలీసులు ఎప్పుడు.. ఎవరి ఇంటి తలుపులు కొడతారో తెలియక భయపడుతుంటే.. మరోపక్క కొందరు టీడీపీ నేతలు మెల్లగా పక్క పార్టీలోకి జారుకుంటున్నారు. ఇవన్ని చూసి కూడా చంద్రబాబు ఏం చెయ్యలేకపోతున్నారని ఏపి రాజకీయాలో మాటలు.

ఇక ఇలా కాదు ఏలాగైనా జగన్ సర్కార్ స్పీడ్ కి బ్రేక్ వెయ్యాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అందుకే స్వయంగా ఆయనే రంగం లోకి దిగ్గి ఓ భారీ ప్లాన్ వేస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఆయన రాజకీయ 40 years అనుభవాలను మొత్తం ఉపయోగించి.. వైసిపి ఆటలకు చెక్ పెట్టాలని, మళ్లీ టీడీపీ కి పునః వైభవం రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అని అంటున్నారు పార్టీ నేతలు.

ఒకవేళ అదే జరిగి.. చంద్రబాబు అనుభవం ముందు, ఆయన తెలివితేటల ముందు జగన్ నిలబడలేక పోతే.. 2024 లో మళ్లీ సైకిల్ స్పీడ్ పెంచుతుంది అంటున్నారు పలువురు విశ్లేషకులు. దీనికి తోడు ఈ మధ్య లోకేష్ కూడా పార్టీ లో యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ కార్యకలపాలో కూడా హుషారుగా పాల్గొంటున్నారు. టీడీపీ అభిమానులు కూడా లోకేష్ పని తీరుకి ఫిదా అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ కి ఇక అన్ని శుభాలే అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.