కరోనా ఎఫక్ట్: పాకిస్థాన్‌లో నుంచి స్వదేశానికి చేరుకోనున్న 114 మంది భారతీయులు

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి కారణంగా పాకిస్థాన్‌లో చిక్కుకున్న 114 మంది భారతీయులు జులై 9న స్వదేశానికి చేరుకోనున్నారు. దీని పై పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అట్టారి-వాగా బోర్డర్ ద్వారా పాకిస్థాన్‌లో చిక్కుకున్న 700 మందికి పైగా భారతీయులు తమ మాతృభూమికి చేరుకున్నారు. భారతీయులంతా పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలిసేందుకు వెళ్లి అక్కడే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కరోనా నేపథ్యంలో భారతీయులకు ముందుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారణ అయిన తరువాతే పాకిస్థాన్ ప్రభుత్వం వారిని భారత్‌కు పంపుతుంది.