విదేశీ విద్యార్థుల‌కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా ఫారెన్‌ స్టూడెంట్స్‌కు షాక్‌ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్‌ స్టూడెంట్స్‌ పూర్తి ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. కొత్తగా అడ్మిషన్‌ తీసుకునే వారు కూడా ఆన్‌లైన్‌ క్లాసులను ఆప్ట్‌ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అలా లేని పక్షంలో ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్టూడెంట్స్‌ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఎఫ్‌1, ఎం1 విద్యార్థుల‌కు మాత్రం వెస‌లుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు అమెరికా ఇమ్మిగ్రేష‌న్ శాఖ వెల్ల‌డించింది. ఎఫ్‌-1 వీసా విద్యార్థులు అకాడ‌మిక్ కోర్సును, ఎం-1 వీసా విద్యార్థులు వొకేష‌న‌ల్ కోర్సుల‌ను చ‌దువుకోవ‌చ్చు అని ఐసీఈ వెల్ల‌డించింది.