హెచ్‌-1బీ వీసాల రద్దుతో భారత ఐటీ కంపెనీలకు భారీ నష్టం

వాస్తవం ప్రతినిధి: హెచ్‌-1బీ వీసాల రద్దుతో భారత ఐటీ కంపెనీలపై రూ.1,200 కోట్ల వరకు భారం పడనుందని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. మరోవైపు కొవిడ్‌-19 కారణంగానూ ఈ ఏడాది భారత ఐటీ కంపెనీల లాభాలకు 23 శాతం గండిపడనుందని తెలిపింది. డిసెంబరు వరకు కొత్త హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల జారీ నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ సర్కారు గత నెలలో ప్రకటించింది. దీంతో ఈ వీసాలపై భారత ఐటీ నిపుణుల్ని అమెరికా తీసుకెళ్లి, అక్కడి తమ ఐటీ యూనిట్లలో పని చేయించుకునే అవకాశం భారత ఐటీ కంపెనీలకు పోయింది. అవసరమైన ఉద్యోగుల్ని 25 శాతం అఽధిక జీతాలతో స్థానికులతోనే భర్తీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.