మరో హాట్ సినిమా తీయబోతున్న రాంగోపాల్ వర్మ..!!

వాస్తవం సినిమా: ‘క్లైమాక్స్’ మరియు ‘నగ్నం’ ఇలాంటి వేడెక్కించే శృంగార సినిమాలు తీసి లాక్ డౌన్ టైం లో ఓటిటి లో రిలీజ్ చేసి భారీ స్థాయిలో ఆర్జివి లాభాలు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా మరో హాట్ సినిమా రాంగోపాల్ వర్మ తీయటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన నెక్స్ట్ సినిమా గురించి వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన అప్సర రాణి అనే యువతిని తన కొత్త సినిమా హీరోయిన్ గా పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా వరుస ట్వీట్స్ చేశాడు. ఇప్పటికే ఈమె రెండు తెలుగు సినిమాల్లో నటించింది. కాని ఇండస్ట్రీలో కూడా ఈమె చాలా మందికి తెలియనే తెలియదు. కాగా ‘థ్రిల్లర్’ టైటిల్ తో ఈ సినిమా చేస్తున్నట్లు త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ అప్సర రాణి కి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.