ఆ విషయంలో అందుకే హడావిడి చేస్తున్నారట కేసిఆర్..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మొండిగా తాను అనుకున్నది సాధించేవరకు నిద్రపోను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజెంట్ ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టాలని ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా కేసిఆర్ వ్యవహరించటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న సచివాలయం వల్ల కేసిఆర్ పరిపాలన కు ఎక్కువ అడ్డంకులు కలుగుతాయని కొందరు వేదపండితులు చెప్పటంతో సచివాలయం కొత్తది కట్టాలని కేసిఆర్ ఎప్పుడో డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాలన్న ఆయన ఆలోచన కార్యరూపం దాల్చుతోంది.తొలుత హైకోర్టులో దీనికి అడ్డంకి ఎదురైనా ,కొంత ఆలస్యంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దాంతో సచివాలయ భవనాలను కూల్చడం ఆరంబించారు. భారీ పోలీస్ బందో బస్త్ తో ఈ ప్రక్రియ సాగుతోంది.సచివాలయం వైపు వెళ్లే ట్రాఫిక్ అంతటిని ఆపివేశారు. కాగా మరో వైపు కొత్త సచివాలయ డిజైన్ లు కూడా సిద్దం అయినట్లు సమాచారం.