ఏపీ రాజధాని పై మరోసారి క్లారిటీ ఇచ్చిన బొత్స..!!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల విషయం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు భూములు ఇచ్చిన వారు తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆందోళనలు నిరసనలు కూడా చేస్తున్నారు అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటన చేసిన బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. . ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్నది ఆనాడు వైఎస్ కోరిక అని దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన తనయుడు జగన్ తీర్చబోతున్నాడని తెలిపారు. అంతే కాకుండా ఏపీలో మూడు రాజధానులు ఖచ్చితంగా ఉంటాయని అమరావతి కేవలం శాసన మండలి రాజధానిగా మాత్రమే కొనసాగుతుంది అని అందులో ఎలాంటి సందేహం లేదని బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.