రాష్ట్రపతి ‌‌ తో ప్రధాని భేటీ..కీలక చర్చలు!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. జాతీయ, అంతర్జాతీయానికి సంబంధించిన పలు అంశాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చర్చించారు. సరిహద్దులో భారత్, చైనా మధ్య జూన్ 15న జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతోసహా 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలను దాటింది. ఈ నేపథ్యంలో ఈ అంశాల గురించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ వివరించినట్లు సమాచారం.