వందే భారత్ మిషన్: ఇప్పటి వరకు స్వదేశానికి చేరిన 5లక్షల మంది ఎన్నారైలు

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 5లక్షల మంది ఇండియాకు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. రెండు నెలల్లోపే 137 దేశాల నుంచి 5,03,990 మందిని భారత్‌కు తరలించినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఒక్క యూఏఈ నుంచే అత్యధికంగా 57వేల మందికిపైగా ప్రవాసులు భారత్‌కు చేరుకున్నట్లు వివరించింది. దాదాపు 91వేల మంది నేపాల్, భూటాన్ తదితర దేశాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇండియాకు చేరినట్లు తెలిపింది.