లిన్ డాన్ సంచలన ప్రకటన!

వాస్తవం  ప్రతినిధి:  చైనా బ్యాడ్మింటన్ లెజెండ్, రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్ లిన్ డాన్ సంచలన ప్రకటన చేశారు. 36 ఏళ్ల చైనా బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్.. తాను రిటైర్‌ అవుతున్నట్లు శనివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో లిన్ డాన్ బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించిన లిన్ తన అద్భుత ఆటతో చైనాకు ఎన్నో పతకాలు అందించారు. అతనితో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి ఆటగాళ్లు వణికేవారు.