కరోనా నుండి కోలుకున్న ఆ క్రికెటర్..!!

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ డేంజర్స్ కరోనా వైరస్ బారిన పడ్డిన సంగతి తెలిసిందే. గత నెల 13న అఫ్రిది కరోనా పాజిటివ్‌గా తేలాడు. అయితే తాజాగా కోవిడ్‌–19 బారినపడిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కోలుకున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో ‘నెగెటివ్‌’గా నిర్ధారణ అయినట్లు అతను వెల్లడించాడు. ‘నేను, నా భార్య, అమ్మాయిలు కూడా కోవిడ్‌–19నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది’ అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు.