కోహ్లీతో నన్ను పోల్చకండి: పాక్‌ క్రికెటర్

వాస్తవం ప్రతినిధి: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కాకుండా పాకిస్థాన్‌ ఆటగాళ్లతో తనను పోల్చాలని పాక్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజామ్‌ కోరాడు. అప్పుడే తాను సాధించిన ఘనతకు తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. క్రికెట్‌లో అద్భుతమైన షాట్లు కొట్టే ఆజామ్‌ను అభిమానులు ఎక్కువగా కోహ్లీతో పోలుస్తుంటారు. దీని పై బాబర్‌ మాట్లాడుతూ ‘నన్ను ఎవరితో అయినా పోల్చాలనుకుంటే కోహ్లీతో కాకుండా పాకిస్థాన్‌ క్రికెటర్లతో పోలిస్తే సంతోషిస్తా, జావెద్‌ మియాందాద్‌, యూనిస్‌ఖాన్‌, ఇంజమాముల్‌ ఉల్‌ హఖ్‌ వంటి వారితో పోలిస్తే మరింత గర్వపడతా’ అని అన్నాడు.