మహేష్ ప్లేసులో రజినీకాంత్ తో డైరెక్టర్ పూరి జగన్నాథ్..!!

వాస్తవం సినిమా: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘జనగణమన’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇటీవల తెలపటం మనకందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని మహేష్ బాబు కోసం ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు పూరి చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ మహేష్ తో చేస్తునట్లు గతంలో పూరి అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాథ్ కి వరుస ఫ్లాపులు రావటంతో మహేష్ ఈ ప్రాజెక్టు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిన ఈ సినిమా స్క్రిప్టు విని మహేష్ కి నచ్చకపోవడంతో పూరి జగన్నాథ్ ఈ సినిమాని సౌత్ ఇండియా సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ తో కలిసి సినిమా చేయాలని తాజాగా డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకోసం స్క్రిప్టులో కొద్దిగా మార్పులు పూరి చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.