ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అంటున్న రామ్ గోపాల్ వర్మ హీరోయిన్..!!

వాస్తవం సినిమా: ఇటీవల వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం నేకేడ్’ హీరోయిన్ స్వీటీ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన స్వీటీ ‘నగ్నం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పలు వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వస్త్రధారణ విషయంలో చాలా పద్ధతిగా పెరిగానని కేవలం సన్నివేశాలకు తగ్గట్టు రీతిలో మాత్రమే ‘నగ్నం’ సినిమాలో నటించడం జరిగిందని స్వీటీ తెలిపింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరు అంటే టక్కున పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ప్రత్యేకమైన అభిమానం అని స్వీటీ తెలిపింది.