గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు చెప్పిన ఉపాసన..!!

వాస్తవం సినిమా: మెగా కోడలు ఉపాసన ఎప్పుడు నిత్యం సమాజం కోసం చారిటీ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. సొంత సంస్థ అపోలో ద్వారా ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులకు లాక్‌డౌన్‌ టైములో ఉచితంగా మెడిసిన్ లు పంచడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీశైలం భగవంతుని దర్శించుకున్న ఉపాసన తర్వాత శ్రీశైలం అడవులలో ఉన్న గిరిజనుల దగ్గరకు వెళ్లింది. ట్రైబల్ ఏరియా కావటంతో అక్కడ ఎక్కువగా అంటు వ్యాధులు వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్న తరుణంలో వాటి నుండి ఎలా తప్పించుకోవాలి వంటి విషయాలపై ఆరోగ్య సూత్రాలు తెలియజేసింది. అంతేకాకుండా నిత్యావసర సరుకులు మరియు కొంతమేర ఆర్థిక సాయం కూడా చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మెగా అభిమానులు ఉపాసన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.